మన దేశంలో బెస్ట్ పోస్టల్ స్కీమ్ ఇదే

మన దేశంలో బెస్ట్ పోస్టల్ స్కీమ్ ఇదే

0
112

మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అలాగే పోస్టాఫీసుల్లో డిపాజిట్లు చేస్తే ఆ నగదుకి సెక్యూరిటీ ఉంటుంది అని భావిస్తాం.. అందుకే చాలా మంది ఇలా పోస్టాఫీసుల్లో సేవింగ్ స్కీమ్స్ లో కూడా చేరుతూ ఉంటారు, పోస్టాఫీస్‌లు వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. అందులో రికరింగ్ డిపాజిట్స్ కూడా పోస్టాఫీస్ అందించే స్కీమ్స్‌లో ఒక భాగమే అని చెప్పాలి.. .మరి వాటి గురించి తెలుసుకుందాం.

1..ఈ అకౌంట్ ఒకరు లేదా ఇద్దరు కలిసి ప్రారంభించొచ్చు. జాయింట్ అకౌంట్ కూడా ఉంటుంది.
2.. క్యాష్ లేదా చెక్ రూపంలో డబ్బులు చెల్లించి ఖాతాను ప్రారంభించొచ్చు.
3.. ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం కూడా దేశం అంతా అందుబాటులో ఉంది
4..మరి బ్యాంకుల మాదిరి దీనికి కూడా వడ్డీ రేటు ఉంటుంది..పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.2 శాతంగా ఉంది.
5. వడ్డీని సంవత్సరానికి ఒకసారి మీ ఖాతాకు జమ చేస్తారు.
6.. మీరు నెలకి 1,000 డిపాజిట్ చేయాలని ప్లాన్ చేశారు ఇలా ఐదు సంవత్సరాలకి 60 వేలు అవుతుంది.
7. దీనికి అడిషనల్ గా మీకు మెచ్యూరిటీ సమయంలో మీకు రూ.72,312 రూపాయలు వస్తాయి.
8..వరుసగా నాలుగు నెలలు మీరు డబ్బులు కట్టకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది.
9. డబ్బులు అవసరం అనుకుంటే మీకు ఏడాది తర్వాత మీరు కట్టిన అమౌంట్ నుంచి 50 శాతం ఇస్తారు.
10..పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ కాల పరిమితి 5 ఏళ్లు.