మన దేశంలో ఇప్పటికే 20 వేల కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, అయితే రెడ్ జోన్లు కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించింది, ఇక కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది, ఈ సమయంలో మే 3 వరకూ విధించిన లాక్ డౌన్ మరికొద్ది రోజులు పొడిగిస్తారా లేదా ఎత్తివేస్తారా అనేది తెలియాలి, పీఎం సీఎంలతో మాట్లాడిన తర్వాత దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది.
అయితే ఇండియాలో రెడ్ జోన్లు చాలా ఉన్నాయి, కాని కొన్ని రాష్ట్రాలు కరోనా ఫ్రీతో సేఫ్ జోన్లో ఉన్నాయి, ఇది మనకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి, మరి ఆ ఫ్రీ ప్రాంతాలు ఏమిటో చూద్దాం…గోవా, నాగాలాండ్, మిజోరం త్రిపుర ఇక్కడ ఒక్క కరోనా కేసు కూడా లేదు.
మొత్తం ఈ ప్రాంతాల్లో వైరస్ సోకిన వారు కూడా చికిత్స తీసుకుని పూర్తిగా వైరస్ నుంచి కోలుకుని డిశ్జార్జ్ కూడా అయ్యారు. ఇక సిక్కిం, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ లో కూడా ఒక్క కేసు నమోదు కాలేదు.మొత్తానికి ఈ స్టేట్స్ సేఫ్ జోన్లో ఉన్నాయి, అయినా ఇక్కడ లాక్ డౌన్ అమలు అవుతోంది, కాని కొన్ని సడలింపులు మాత్రమే ఇచ్చారు.