మన దేశంలో బైక్ కారు కొనేవారికి ఆగస్ట్ 1 నుంచి గుడ్ న్యూస్

మన దేశంలో బైక్ కారు కొనేవారికి ఆగస్ట్ 1 నుంచి గుడ్ న్యూస్

0
89

ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది కొత్త బైకులు కార్లు కొనాలి అని భావించిన వారు ఆగిపోయారు, దీంతో ఆ రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది, అయితే వచ్చే రోజుల్లో అమ్మకాలు పెరిగితేనే ఆ రంగం పుంజుకుంంటుంది అంటున్నారు నిపుణులు.

ఈ సమయంలో ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.ఆగస్ట్ 1 నుంచి కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయి. ఇందుకు కారణం ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI తీసుకున్న నిర్ణయమే.

మీరు ఇక ఆగష్ట్ 1 నుంచి కారు బైక్ కొంటేలాంగ్ టర్మ్ వెహికిల్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీ పాలసీలు ఇక తీసుకో అక్కర్లేదు ఏడాదికి తీసుకుంటే సరిపోతుంది, ఇప్పటి వరకూ అమలు చేస్తున్న దీనిని మార్చేశారు.
దీంతో కార్లు, బైకుల ఆన్ రోడ్ ప్రైస్ తగ్గనుంది..ప్రస్తుతం ఫోర్ వీలర్లకు మూడేళ్లు, టూవీలర్లకు ఐదేళ్లు లాంగ్ టర్మ్ కాంప్రహెన్సీవ్ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది, ఇప్పుడు ఇది సవరించారు..ఇలా చేయడం వల్ల బైక్ కారు కొనేవారు ఐదేళ్లకు ముందుగా కడుతున్నారు, దీని వల్ల ఖరీదు పెరుగుతోంది, ఇక ప్రతీ ఏడాది రెన్యువల్ చేయించుకుంటే సరిపోతుంది.