ఎంతో శక్తివంతమైన క్షేత్రాలుగా శక్తిపీఠాలు ఉన్నాయి, అవి మొత్తం మన దేశంలో 18 ఉన్నాయి, ఇప్పటికీ చాలా మంది వాటిని అన్నీంటిని దర్శించాలి అని భావిస్తారు, అయితే ఆ దర్శన భాగ్యం చాలా మందికి దక్కుతుంది, కొన్ని దూర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, అయితే ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి అనేది చూద్దాం.
భ్రమరాంబిక దేవీ – శ్రీశైలం ఏపీ
చాముండేశ్వరీ దేవి. మైసూరు, కర్ణాటక
శాంకరి – శ్రీలంక
కామాక్షి దేవీ కంచి
శృంఖల దేవీ – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
జోగులాంబ – ఆలంపూర్, తెలంగాణ
మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర
ఏకవీరిక – నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర అమ్మవారిని రేణుకామాతగా కొలుస్తారు
మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
పురుహూతిక – పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్
గిరిజ – ఒడిషా – వైతరిణీ నది తీరాన ఉంది ఆలయం
మాణిక్యాంబ – ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్
కామరూప – హరిక్షేత్రం, గౌహతి
మాధవేశ్వరి – ప్రయాగ అలహాబాదు ఉత్తర ప్రదేశ్
వైష్ణవి – జ్వాలాక్షేత్రం హిమాచల్ ప్రదేశ్
మంగళ గౌరి దేవి – గయ బీహారు
విశాలాక్షి – వారాణసి, ఉత్తర ప్రదేశ్.
సరస్వతి – జమ్ము కశ్మీర్
ఇప్పటీకీ ఈ ఆలయాలకు ఆయా స్టేట్ ల నుంచి దర్శనీయ ప్రాంతాలుగా వెళతారు, అనేక తీర్దయాత్ర
ట్రావెల్స్ వారు తీసుకువెళతారు.