మండలికి ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన సీఎం జగన్….

మండలికి ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన సీఎం జగన్....

0
104

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలికి కాబోయే ఇద్దరి పేర్లను అగ్ర నాయకత్వం ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది…. గవర్నర్ కోటలో ఖాళీగా ఉన్న రెండు
శాసన మండలి సభ్యత్వాల కోసం కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తాజాగా తుది జాబితా ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి…

గుంటూరు జిల్లా కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ పర్చిమ గోదావరి జిల్లా కు చెందిన మోహన్ రాజును గవర్నర్ కోటా కింద శాసన మండలికి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చింటున్నరు…

మర్రి రాజశేఖర్ పేరు ఇప్పటికే ప్రచారంలో ఉంది… ఎమ్మెల్యే విడుదల రజనీ కోసం చిలకలూరి పేట స్థానాన్ని కోల్పోయిన మర్రి రాజశేఖర్ కు అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారం శాసన మండలికి ఎంపిక చేయడం ఖాయం అని వైసీపీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి… ఇక మరో స్థానంకోసం దళిత కొయ్యెమోహన్ రాజును ఎంపిక చేసినట్లు విస్వసనీయ వర్గాల సమాచారం… ఈ రెండుపేర్లతో కూడిన జాభితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే గవర్నర్ కు అందజేస్తారని వార్తలు వస్తున్నాయి.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొయ్యె మోహన్ రాజు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే…