మందు దొరకక 9 మంది మృతి- సీఎం కీలక నిర్ణయం

మందు దొరకక 9 మంది మృతి- సీఎం కీలక నిర్ణయం

0
108

దేశంలో కరోనా వైరస్ అతి దారుణమైన స్దితిలో ఉంది… ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత కేరళ మహరాష్ట్రలో కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడిక్కడ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో మద్యానికి బానిసైన వారి పరిస్థితి మరింత దిగజారింది.

కరోనా సోకితే పోవడం ఎలా ఉన్నా ఇప్పుడు మద్యం లేక జనాలు చనిపోతున్నారు, నిత్యం దానికి అలవాటు పడి చుక్కలేక నిద్రపట్టక చాలా మంది మతిపోతోంది అంటున్నారు, ఓ పక్క కల్లుతాగి కొందరు చల్లబడుతుంటే, మరికొందరు కల్లు వద్దని మద్యమే కావాలి అని మంకుపట్టుపడుతున్నారు.

ఏకంగా మద్యంలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..ఇప్పటివరకు కేరళలో 9 మంది మద్యం దొరక్క మృతి చెందగా, మరో ఆరుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, ఒత్తిళ్లు పెరుగుతుండడంతో సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మద్యం సరఫరా చేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. మద్యానికి బానిసైన వారిని డీ ఎడిక్షన్ సెంటర్లకు పంపాలని స్పష్టం చేశారు. తిండి లేక చనిపోయిన వారిని చూశాం మద్యం లేక చనిపోతున్న వారిని వీరినే చూస్తున్నాం అంటున్నారు అందరూ.