మందుబాబుల‌కి చేతికి ఇంక్ మార్క్ మందుకావాలంటే ఆధార్ నెంబ‌ర్

మందుబాబుల‌కి చేతికి ఇంక్ మార్క్ మందుకావాలంటే ఆధార్ నెంబ‌ర్

0
126

లాక్ డౌన్ వేళ స‌డ‌లింపుల్లో మ‌ద్యం షాపుల‌కి కూడా ప‌ర్మిష‌న్ ఇచ్చారు, దీంతో మందుబాబులు మ‌ద్యం కొనేందుకు బారులు తీరుతున్నారు. దీంతో వైర‌స్ తీవ్ర‌త ఇంకా పెరుగుతుంది అనే భ‌యం అంద‌రిలో క‌నిపిస్తోంది, దాదాపు వేల మంది ఇలా క్యూ లో నిల‌బ‌డి మ‌ద్యం కోసం ఎగ‌బ‌డుతున్నారు, అందుకే కొన్ని చోట్ల పోలీసులు కూడా వ‌చ్చి మందుబాబుల‌ని భౌతిక దూరం పాటించేలా నిల‌బెడుతున్నారు.

హోషంగాబాద్ మందుబాబులను గుర్తించేందుకు మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం వినూత్న విధానాన్ని అవలంభిస్తోంది. మద్యం కొనేవారి చేతి వేలిపై ఇంకు చుక్క పెడుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒక‌వేళ ఎవ‌రికైనా వైర‌స్ ఇందులో వారికి వ‌చ్చినా వారిని జాగ్ర‌త్త చేసేందుకు వారి వివ‌రాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి అని చేస్తున్నారు..

వారి పేర్లు, చిరునామా, మొబైల్‌ ఫోన్‌ నంబర్లు మద్యం కాణంలోని రిజిస్టర్‌లో నమోదు చేయాలని నిర్ణ‌యం తీసుకున్నారు,మందు కొంటే ఆధార్ కార్డ్ చూపి, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిందే, దీంతో ఎక్కువ‌సార్లు రాకుండా రోజుకి రెండు రోజుల‌కి వ‌చ్చి మ‌ద్యం కొంటున్నారు మందు బాబులు.