మొత్తానికి ఈ కరోనా వైరస్ వ్యాప్తితో దాదాపు నెల 10 రోజుల లాక్ డౌన్ అనే చెప్పాలి …మార్చి 20 నుంచి పరిస్దితి ఇలాగే ఉంది, ఇక ఏప్రిల్ నెలాఖరు వరకూ లాక్ డౌన్ ఉంటుంది అని తెలిపారు సీఎం కేసీఆర్.. మరో 15 రోజులు లాక్ డౌన్ తెలంగాణలో పొడిగించారు.
అయితే ఈ సమయంలో రైతులకి భరోసా ఇచ్చారు కేసీఆర్ …అంతేకాదు 1 నుంచి 9 వ తరగతి విధ్యార్దులని నేరుగా తర్వాత తరగతులకి ప్రమోట్ చేస్తున్నారు, ఇక ఈ సమయంలో లాక్ డౌన్ కఠినంగా అమలు అవుతుంది అని చెప్పారు ఆయన.
లాక్‌డౌన్ కు సహకరించిన ప్రజలు ధన్యవాదాలు తెలిపిన సీఎం..ఇదే స్ఫూర్తిని మరికొన్ని రోజులు కొనసాగించాలని కోరారు. . 10 తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఫైనల్ గా లిక్కర్ విషయంలో తెలంగాణలో వైన్స్ ఓపెన్ అవ్వవు అని చెప్పారు, ఎక్కడా వైన్స్ తీయమని
లాక్ డౌన్ అయ్యేవరకు ఓపెన్ చేయం అని తెలిపారు.