Breaking News.. కాంగ్రెస్ సీరియస్ : పాడి కౌషిక్ రెడ్డికి తాఖీదు

0
107

హుజూరాబాద్ కాంగ్రెస్ నేతగా ఉన్న కౌషిక్ రెడ్డిని సోమవారం ఆ పార్టీ బహిష్కరించింది. అయితే తానే కాంగ్రెస్ కు రాజీనామా చేశానని ఆయన అంటున్నారు. అయితే తాజాగా కౌషిక్ రెడ్డికి ఎఐసిసి ఇన్చార్జి మణికం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపించారు.

పాడి కౌషిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్న సమయంలో రేవంత్ రెడ్డిపైనా, మణికం ఠాగూర్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 50 కోట్లు మణికం ఠాగూర్ కు ఇచ్చి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు.

దీంతో పాడి కౌషిక్ రెడ్డికి మణికం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజులలో భేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీస్ లో పేర్కొన్న మనిక్కమ్ ఠాగూర్. లేనిపక్షంలో ఒక కోటి రూపాయల పరువు నష్టపరిహారం తోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కౌషిక్ రెడ్డి రిప్లై తర్వాత ఏరకమైన కార్యచరణ తీసుకుంటారన్నది తేలనుంది. కౌషిక్ రెడ్డికి పంపిన లీగల్ నోటీసు కింద ఉన్నది చూడొచ్చు.