ప్రపంచమే కరోనాతో విలవిలలాడుతోంది, ఈ సమయంలో అసలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టడం లేదు ఎవరూ, ఇక ఈ సమయంలో వైరస్ అటాక్ అయితే మరింత డేంజర్.. అందుకే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు మన దేశంలో..
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ అమలు అవుతోంది, తెలంగాణ ఏపీలో కూడా కేసులు నమోదు అవుతున్నాయి, వాటి కట్టడి కోసం కీలక స్టెప్స్ తీసుకుంటోంది ఏపీ సర్కార్. అయితే ఆర్ధికమాంధ్యం కూడా దారుణంగా ఉంది.. ఈ సమయంలో కంపెనీలు చాలా వరకూ ఉద్యోగాలు తీసేస్తాయి అని చాలా వార్తలు వస్తున్నాయి. పలు కంపెనీలు ఆల్రెడీ ఆ వర్క్ లో ఉన్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీలకు లేఖ రాశారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక్క ఉద్యోగిని కూడా ఉద్యోగం నుంచి తొలగించకుండా.. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలని ఆయా కంపెనీలను విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా మళ్లీ ఐటీ పరిశ్రమ పుంజుకుంటుంది అని తెలిపారు, కచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు కేటీఆర్.