కరోనా పేరుతో నిత్యవసర వస్తువుల ధరను పెంచి వ్యాపారస్తులు సొమ్ముచేసుకుంటున్నారు.. పది 20 రూపాయలు ఉన్న నిత్యవసర వస్తువు ధర వందకు పైగా పెంచి అమ్ముతున్నారు దీనిపై సర్కార్ సీరియస్ అయింది…
వ్యాపారస్తులు పెంచుతున్న ధరలపై మంత్రి నాని మాట్లాడుతూ… వ్యాపారస్తులు నిత్యవసర వస్తులను అధిక ధరలకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని అవసరమైతే జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు…
కరోనాను నివారించేందుకు ప్రజలు సహకరించాలని తెలిపారు నాని… సీఎం జగన్ సూచనల మేరకు ఈ నెల 29న రేషన్ సరుకులు అందజేస్తామని తెలిపారు.. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారిని ఉచిత రేషన్ తోపాటు కిలో కందిపప్పు అందిస్తామని స్పష్టం చేశారు…