మంత్రి సవాల్ ఎంపీ ప్రతిసవాల్

మంత్రి సవాల్ ఎంపీ ప్రతిసవాల్

0
89

వైసీపీకి రాజకీయంగా అంతా బాగానే ఉంది.. కాని వైసీపీ లో నరసాపురం నుంచి గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది, స్వపక్షంలో విపక్షంలా మారింది అనే చెబుతున్నారు, ఓ పక్క తాను ప్రభుత్వానికి మంచి చేస్తున్నా అంటూనే సీఎం జగన్ మనిషినే అంటూనే అన్నీంటిపై వ్యతిరేకిస్తున్నారు.

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో చేసిన సవాల్కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు. ఇక మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా వత్తాసు పలకడం కాదు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ మీరు సొంతంగా గెలవాలి అని మంత్రి బాలినేని సవాల్ చేశారు.

అయితే దీనికి ఎంపీ సమాధానం ఇచ్చారు…నేను నా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నెగ్గితే… అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని మీ సీఎం రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధమేనా… నా ఛాలెంజ్ను స్వీకరిస్తే రాజీనామా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా అని అన్నారు, అంతేకాదు ఈ ఉప ఎన్నికని అమరావతికి రిఫరెండెంగా తీసుకుందాం మీరు సీఎం సిద్దమా అని ఆయన ప్రతిసవాల్ విసిరారు..అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలి అని కోరుతున్నారు నరసాపురం ఎంపీ రాజుగారు.