సికింద్రాబాద్ ఘటన పై మావోయిస్టుల రియాక్షన్

0
96

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ పథకం తీవ్ర దుమారం రేపింది. ఇంత జరిగిన కూడా కేంద్రం మాత్రం అగ్నిపథ్ ను వెనక్కి తీసుకునేదే లేదని తేల్చి చెబుతూ నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు. దీనిని ప్రతిపక్షాలు, ఆర్మీ అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొన్న సికింద్రాబాద్ లో జరిగిన కాల్పులు, అగ్నిపథ్ పై తాజాగా మావోయిస్టులు స్పందించారు.

కాల్పుల ఘ‌ట‌న‌ను ఖండిస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర క‌మిటీ కార్య‌ద‌ర్శి జ‌గ‌న్ పేరిట మావోయిస్టులు సోమ‌వారం ఓ లేఖ‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ లేఖ‌లో ప‌లు కీల‌క అంశాల‌ను ప్రస్తావించిన మావోయిస్టులు… ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి త‌క్ష‌ణ‌మే నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని కూడా మావోయిస్టులు ఆ లేఖ‌లో డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్ కాల్పుల్లో చ‌నిపోయిన రాకేశ్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాల‌ని, బాధితుడి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని కోరారు. అంతేకాకుండా కాల్పులు జ‌రిపిన పోలీసుల‌పై హ‌త్యా నేరం కింద కేసులు న‌మోదు చేయాల‌ని మావోయిస్టులు డిమాండ్ చేశారు.

ఆర్మీ ఉద్యోగాల కోసం కొన్ని నెలలుగా ఎంతో మంది అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ఇలాంటి తరుణంలో..నాలుగేళ్లే ఆర్మీ ఉద్యోగం అంటూ మోడీ ప్రభుత్వం అగ్నిపథ్ ను తీసుకొచ్చింది. నాలుగేళ్ల తర్వాత తమ పరిస్థితి ఏంటని ఆర్మీ అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు.