గత ఏడాది మార్చి 22  జనతా కర్ఫ్యూ – నాటి పరిస్దితులు నేటి పరిస్దితులు

-

లాక్ డౌన్ ఈ మాట వింటేనే జనం వణుకుతున్నారు… గత ఏడాది మార్చి 22న సరిగ్గా ఏడాది క్రితం ఇలాగే జనతా కర్ఫూ విధించారు.. అప్పుడే ఏడాది అయింది చాలా మంది కుటుంబ సభ్యులని కోల్పోయారు..  ఈ కరోనా వల్ల చాలా కుటుంబాల జీవితాల్లో విషాదం మిగిలింది, అయితే ఇంకా కేసులు మాత్రం తగ్గలేదు మళ్లీ లాక్ డౌన్ విధించేలా కొన్ని ప్రాంతాలు మారాయి.
ఓ పక్క వాక్సిన్ వచ్చినా సరే కేసులు సంఖ్య మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది.. జనతా కర్ఫ్యూతో మొదలైన లాక్డౌన్ ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది. దాదాపు అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, ఎవరూ బయటకు రాలేదు.
మార్చి 25 నుంచి కేంద్ర ప్రభుత్వం 23 రోజుల పాటు మళ్లీ లాక్ డౌన్ విధించింది.
 ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు 19 రోజుల పాటు రెండో విడత లాక్ డౌన్ విధించారు
 మే 4 నుంచి 17 వరకు 14 రోజులపాటు మూడో విడత లాక్డౌన్
 మే 18 నుంచి 31 వరకు 14 రోజులపాటు నాల్గో విడద లాక్ డౌన్ పెట్టారు,
ఇక జూన్ 1 నుంచి అన్ లాక్ ప్రక్రియ మొదలైంది, డిసెంబర్ నుంచి వాక్సిన్ వచ్చింది, అయినా కేసులు మాత్రం తగ్గడం లేదు ఇప్పుడు ముంబై మహారాష్ట్ర పంజాబ్ కేరళలో ఇంకా కేసులు పెరుగుతున్నాయి.. నేడు ఏకంగా  46,951 మందికి కరోనా నిర్ధారణ
అయింది, మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అప్పుడు ఈ కరోనాని తరిమికొట్టగలం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....

Director Shankar | నెగిటివ్ రివ్యూలకే అవే సమాధానం చెప్తాయి: శంకర్

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shankar) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా పనుల్లో...