మారిటోరియం వారికి గుడ్ న్యూస్ –వడ్డీపై వడ్డీ మాఫీ ఎవరికి వర్తిస్తుందంటే

మారిటోరియం వారికి గుడ్ న్యూస్ --వడ్డీపై వడ్డీ మాఫీ ఎవరికి వర్తిస్తుందంటే

0
106

ఈ లాక్ డౌన్ సమయంలో అన్నీ రంగాలు ఇబ్బంది పడ్డాయి, అయితే ఎవరూ బ్యాంకులకి నగదు చెల్లించలేని స్దితి, రీ పేమెంట్లు చేయలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు, అయితే ఉద్యోగులు వ్యాపారులు అందరికి ఇదే పరిస్దితి.

దీంతో లాక్డౌన్ సమయంలో బ్యాంకు రుణాలపై కేంద్రం ఆరు నెలల పాటు మారిటోరియం విధించింది.
ఈ రుణాల వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. మరి ఎవరికి ఇవి వర్తిస్తాయి అనేది చూస్తే, కొందరు సీనియర్ అధికారులు చెప్పేదాని ప్రకారం.

వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారు
చిన్న, మధ్యతరహా రుణగ్రహీతలు
రూ.2 కోట్ల వరకు ఎంఎస్ఎంఈ రుణాలు తీసుకున్నవారికి
విద్యా రుణాలు
గృహ రుణాలు
క్రెడిట్ కార్డ్ బకాయిలు
ఆటో రుణాలు తీసుకున్నవారికి వడ్డీపై వడ్డీ పడితే అది మాఫీ అవుతుంది.

అంతేకాదు, మార్చి- ఆగస్టు మధ్యకాలంలో రుణ వాయిదాలు చెల్లించిన వారికి కూడా ఈ ప్రయోజనం వర్తింపజేయనుంది. సుమారు ఇలా వడ్డీపై వడ్డీలు ఆరువేల కోట్లు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.