దేశంలో కరోనా ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది, ఆర్దికంగా మన దేశం భారీగా నష్టపోతోంది అని చెప్పాలి, అమెరికా లాంటి దేశాలే అలా ఉంటే ఇక మన దేశం పరిస్దితి ఏమిటా అని అందరూ ఆలోచన చేస్తున్నారు, అయితే ఇప్పటికే పేదలకు కేంద్రం అండగా నిలిచింది, మారిటోరియం కూడా పలు ఈఎంఐలపై విధించింది ఇదంతా మధ్యతరగతి పేద వర్గాలకు కలిసి వస్తుంది.
ఈ సమయంలో ఫ్యాక్టరీలు పలు చిన్న తరహ కంపెనీలకు ఇది చాలా నష్టాలని తీసుకువచ్చింది. నిత్యం కంపెనీ నడవకపోతే అప్పులు కూడా తీర్చలేని పరిస్దితిలో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. మరి వాటి పరిస్దితి మరీ దారుణంగా ఉంది, ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్ధిక ప్యాకేజీతో ముందుకు రానున్నట్టు సమాచారం.
ఇప్పటికే పేదల కోసం రూ. 1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రవేశ పెట్టారు .. ఇక తాజాగా పారిశ్రామిక సంస్థలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కేంద్రం దృష్టిపెడుతుందని చెప్పాలి, వారికి ఉన్న ట్యాక్స్ లు పవర్ ఇలా అన్నింటికి కాస్త పన్నులు అలాగే చెల్లింపులు తగ్గిస్తుంది అని తెలుస్తోంది, ప్రధానంగా వినియోగించే వస్తువులకి పన్నులు కూడా తగ్గిస్తారు అని తెలుస్తోంది.