ఎప్పుడైతే మార్కెట్లో భూములకి బాగా డిమాండ్ ఉంటుందో ఎక్కడ అయితే కోట్లకు కోట్లు ధర పలుకుతాయో అక్కడ రియల్ ఎస్టేట్ వారు వాలిపోతారు, ఇక అవినీతి కూడా ఆ ప్రాంతంలో రాజ్యం ఏలుతుంది, అందరూ అలా ఉండరు కాని కొందరు ఉంటారు..ఇలాంటి వారికి బ్రోకర్లకు మరికొందరు అధికారులు కూడా సాయం చేస్తారు, తాజాగా ఓ ఎమ్మార్వో ఇలా ఏకంగా కోటి పదిలక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే బాధితులెవ్వరూ ఫిర్యాదు చేయకుండానే నేరుగా ఏసీబీ అధికారులే నిఘా పెట్టి నాగరాజ్ అనే అతి పెద్ద అవినీతి వ్యక్తిని పట్టుకున్నారు. ఈ నాగరాజ్ కీసర తహశీల్దార్ ..28ఏకరాలకు సంబంధించి భూ వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతోంది..రైతులు అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ భూమికై.
దీనిపై ఓ వ్యాపార సంస్థ కన్ను పడింది. భారీగా ధర పెరగడంతో.. తప్పుడు పత్రాలతో పాసు పుస్తకాలు ఇప్పించేందుకు అప్రోజ్ అయ్యారు. భారీగా నగదు ముట్టజెపుతామంటూ కీసర తహశీల్దారు నాగరాజ్
ఇంటికి ఆ సంస్దవారు బ్రోకర్లు వెళ్లారు, దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు నాగరాజ్ కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.. తహశీల్ధార్ ఇంట్లో మరో రూ. 25లక్ష్లలు దొరికాయి. చూశారుగా ఇలాంటి అవినీతి అధికారులని వదలకండి ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వండి.