మరోసారి క్లారిటీ ఇచ్చిన జీఎన్ రావు కమిటీ….

మరోసారి క్లారిటీ ఇచ్చిన జీఎన్ రావు కమిటీ....

0
77

జీఎన్ రావు కమిటీ మరోసారి క్లారిటీ ఇచ్చింది… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లం చెప్పినట్లుగా కమిటీ నివేధికను తయారు చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దికాలంగా ఆరోపణలు చేస్తున్నారు…

ఇక ఆయన చేస్తున్న ఆరోపణలపై జీఎన్ రావు కమిటీ స్పందించింది… ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది… తాము ముఖ్యమంత్రి సలహాదారుడు అజయ్ కల్లం ప్రభుత్వ వ్యక్తులతో ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు జీఎన్ రావు…. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపనల్లో నిజంలేదని అన్నారు…

13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతోపాటు ప్రజల నుంచి సలహాలు అభిప్రాయాలు తీసుకున్నామని అన్నారు… తమ కమిటీలోని సభ్యులు పట్టణప్రణాళిక, డిజైనింగ్, నగరాభివృద్ది, ప్రపంచ నగరాల అభివృద్ది అంశాల్లో విశేష అనుభవం నైపుణ్యం గలవారు ఉన్నారని తెలిపారు…