మరోసారి నాగబాబు ట్వీట్ ఈసారి సరికొత్త అంశం

మరోసారి నాగబాబు ట్వీట్ ఈసారి సరికొత్త అంశం

0
123

ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు బాలయ్య వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే, అయితే నాగబాబు కామెంట్లపై బాలయ్య ఎలాంటి కామెంట్లు చేయలేదు.. ఇక ఈ వివాదానికి పుల్ స్టాప్ పడింది అని అందరూ భావిస్తున్నారు, అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు రాజకీయాల్లో కూడా యాక్టీవ్ గా ఉండటంతో ఇప్పుడు ఆయన పలు విషయాల గురించి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు..

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు హిందూ దేవాలయాలపై ఆసక్తికర కామెంట్లు చేసారు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండకూడదని బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ అన్నారని , అలాగే హిందూ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వంతో సంబంధంలేని వారి చేతుల్లోనే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో మళ్లీ మెగా బ్రదర్ కామెంట్ పై అందరూ చర్చించుకుంటున్నారు.

హిందు ధర్మం కోసం జీవితాలు త్యాగం చేసిన వారు, మంచి మార్గం చెబుతున్న చాగంటి కోటేశ్వర రావు గారు, గరికపాటి నరసింహ రావు గారు, గీత గంగాధర్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ఇంకా ఎందరో గొప్ప వ్యక్తుల్ని హిందు దేవాలయాలను నిర్వహించే స్థానంలో చూడాలని ఉంది అని నాగబాబు ట్వీట్ చేశారు, మళ్లీ అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు.