మరోసారి నోరు జారిన పుష్ప శ్రీవాణి

మరోసారి నోరు జారిన పుష్ప శ్రీవాణి

0
93

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మరోసారి నోరు జారింది… 13 జిల్లాలను అభివృద్ది చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు…..

తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుష్ప శ్రీవాణి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది… స్వామి వారి దర్శనం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ 13 జిల్లాలను అభివృద్ది చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని అనబోయి 13 రాష్ట్రాల అభివృద్ది చేసే దిశగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని నోరు జారింది…

గతంలో కూడా ఆమె నోరు జరింది జగన్ అవినీతి రహిత అనబోయి అవినీతి రాష్ట్రంగా తీర్చి దిద్దనున్నారని తెలిపింది… ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…