మ‌రో ఆరు నెల‌లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఆ కంపెనీలు సంచ‌ల‌న నిర్ణ‌యం

మ‌రో ఆరు నెల‌లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఆ కంపెనీలు సంచ‌ల‌న నిర్ణ‌యం

0
130

దేశంలో లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, దాదాపు ఇప్ప‌టికే 45 రోజులు అవుతోంది,ఇక వేరే స్టేట్స్ అద‌ర్ కంట్రీస్ లో కూడా ఇలా లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, దాదాపు చైనాలో మూడు నెల‌లు లాక్ డౌన్ లో ఉంది అక్క‌డ దేశం, అయితే ఈ స‌మ‌యంలో కంపెనీ ఉద్యోగులు దాదాపు అంద‌రూ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు దాదాపు 56 శాతం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు.

మ‌న దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ మరి కొద్దీ రోజుల్లో ముగియనుంది. కానీ, దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో వర్క్‌ఫ్రం హోం నిర్ణయాన్ని చాలా కంపెనీలు పొడిగించాలని ఆలోచిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మ‌రో ఆరు నెల‌లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయించాలి అని చూస్తున్నాయ‌ట‌, కేసులు సంఖ్య త‌గ్గేలా లేదు కాబ‌ట్టి ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ట‌.

ఇక అమెరికా నుంచి న‌డిచే చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా ఇదే ఆలోచ‌న చేస్తున్నాయ‌ట‌, ఇక దిగ్గ‌జ సాఫ్ట్ వేర్ కంపెనీలు, అమెరికాకు చెందినవి‌ ఇండియా నుంచి ప్రాజెక్ట్ వ‌ర్క్ చేయించేవి 45 వ‌ర‌కూ ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నాయ‌ట‌. వారి కంపెనీ ఉద్యోగుల‌కి ఈ విష‌యం మెయిల్స్ ద్వారా త్వ‌ర‌లో తెలియ‌చేస్తాయ‌ట‌.