మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటీవ్ – ఆయ‌న ఎవ‌రంటే

మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటీవ్ - ఆయ‌న ఎవ‌రంటే

0
90

ఈక‌రోనా మ‌హ‌మ్మారి సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి రిచ్ పూర్ చిన్నా పెద్ద అనే భేదం ఏమీ లేదు అంద‌రికి పాకేస్తోంది, అయితే ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఇది మ‌రింత విజృంభిస్తోంది, తాజాగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌కి వ‌స్తోంది, ఇప్ప‌టికే వెస్ట్ బెంగాల్ త‌మిళ‌నాడులో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మ‌ర‌ణించారు. ఈ వైర‌స్ అటాక్ అయి.

అందుకే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని చెబుతున్నారు. తాజాగా ఏపీ తెలంగాణ‌లో కూడా ఎమ్మెల్యేల‌కు వైర‌స్ సోకింది, తాజాగా ఇప్ప‌టికే ఓ వైసీపీ ఎమ్మెల్యేకి వైర‌స్ సోకింది ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యేకి వైర‌స్ సోకింది.

వృత్తిరీత్యా డాక్టరైన ఆ నేతకు పాజిటివ్‌ రావడంతో ఇప్పుడు కాంటాక్టులంతా టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా ఆయ‌న‌లో వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి, దీంతో అనుమానం వచ్చి పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఎమ్మెల్యే సుధాకర్ వృత్తి రీత్యా డెంటిస్ట్‌. సెక్యూరిటీని స్టాఫ్ ని ఇక ఇంటికి పంపించేశారు, ఇప్పుడు వారి కుటుంబ స‌భ్యుల‌కి కూడా టెస్టులు చేస్తున్నారు.