అనంతపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను తాజాగా సీజ్ చేసిన సంగతి తెలిసిందే…. నిబంధనలకు విరుద్దంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులను తిప్పుతున్నారని అధికారులు సీజ్ చేశారు…
బస్సుల సీజ్ పై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ప్రభుత్వ చర్యలపై తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు… బస్సుల సీజ్ అక్రమమని హైకోర్టు చెప్పిందన్నారు… సీజ్ చేసిన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చాని జేసీ తెలిపారు…
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బస్సు ప్రమాధం జరిగిందని దాన్ని రాజకీయం చేశారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు… తాము టీడీపీలో ఉన్నామనే కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. అరెస్ట్ లు చేసినా వెనక్కి తగ్గది లేదని భయపడేది లేదని అన్నారు ప్రభాకర్ రెడ్డి