కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి.. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదు అని చెబుతోంది సర్కార్… అంతేకాదు పెద్ద ఎత్తున మాస్క్ లు పెట్టుకోవాలి అని కూడా ప్రచారం చేస్తున్నారు.. కేవలం నిత్య అవసర వస్తువులకి మాత్రమే రావాలి అని చెబుతున్నారు.
దేశంలో పూర్తిగా లాక్ డౌన్ ఉంది, అయితే కొందరు మాత్రం యదేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు, ఈ సమయంలో మాస్క్ లు కూడా ధరించడం లేదు, దీంతో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ.. ముంబై నగర పాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇది మంచి డెసిషన్ అని డాక్టర్లు పోలీసులు అంటున్నారు
వారు ఎంత చెబుతున్నా కొందరు దీనిని పట్టించుకోవడం లేదు ఇక తాజాగా కొత్త రూల్ తీసుకు వచ్చారు
ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాల్సిందేనని ముంబై నగర పాలక సంస్థ సూచించింది. మాస్కులు లేకుండా బయటకు వస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా వస్తే వారిని అరెస్ట్ చేస్తామని, అలాగే భారీగా ఫైన్ వేస్తాము అని ప్రకటన చేస్తోందట.