అసలే కరోనా కాలం.. ఎక్కడ ఎవరికి వైరస్ ఉందో తెలియదు.. చిన్న చిన్న అవసరాలకు కూడా జనం బయటకు వస్తున్నారు.. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా చెప్పింది. ఎవరు బయటకు వచ్చినా ముఖానికి మాస్క్ లేదా కర్చీఫ్ కట్టుకోవాలి అని..
ఈ సమయంలో ఓ కూరగాయల దుకాణానికి ఓ వ్యక్తి వచ్చాడు, కూరగాయలు అమ్మేవ్యక్తి మీరు మాస్క్ లేదా కర్చీఫ్ కట్టుకుంటేనే కూరగాయలు ఇస్తాము లేకపోతే పోలీసులు ఊరుకోరు అని చెప్పాడు, అయితే తననే ఇలా బెదిరిస్తావా అని కూరగాయలు అన్నీ బండి పై నుంచి పడేశాడు.
వ్యాపారిని కొట్టాడు, దీంతో పక్కనే ఉన్న కూరగాయల వ్యాపారులు అందరూ ఆ పొగరు మనిషిని చితక్కొట్టారు, అంతేకాదు పోలీసులకి అప్పగించారు.. దాదాపు 7 వేల రూపాయల కూరగాయలు కింద పడేసి నాశనం చేశాడు అని తేలడంతో.. పోలీసులు కూడా ఆ మొత్తం నగదుని ఆ పొగరు బోతు నుంచి వ్యాపారికి ఇప్పించారు,.10 రూపాయల మాస్క్ కోసం ఇంత అవసరమా అని జనం చుట్టుపక్కల వారు అతనిని తిట్టారట.