ఎక్కడ అయినా మసాజ్ చేసేది మనుషులు అనే విషయం తెలిసిందే… కొన్ని చోట్ల పురుషులు కొన్ని చోట్ల మహిళలు మసాజ్ చేస్తారు, ఆ చార్జీలు ఒక్కో విధంగా ఉంటాయి.. అయితే ఇక్కడ మసాజ్ ఎవరు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక్కడ మసాజ్ పాములు చేస్తాయి…ఒకటి కాదు రెండు.. కాదు ఏకంగా ఐదు నుంచి పది పాములు, చిన్న పాము నుంచి కొండచిలువ వరకూ మసాజ్ చేస్తాయి.
మీ శరీరంపై జారుతూ మసాజ్ చేస్తాయి, ఆందోళన వద్దు అసలు సంగతి చూద్దాం…ఈజిప్టులోని ఈ మసాజ్ సెంటర్ చాలా ఫేమస్..కైరోలోని ఓ స్పాలో ఇదే స్పెషల్. ఇక్కడ మొత్తం ప్రజలకి 28 రకాల పాములు మసాజ్ చేస్తాయి.. చిన్న పాము నుంచి పెద్ద పాము వరకూ అన్నీ మీకు మసాజ్ చేస్తాయి.
మరి విషం ఉంటుంది కదా అని భయం అక్కర్లేదు.. ఎందుకు అంటే ఇందులో అన్నీ విషం లేని పాములే.. ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు. మొత్తం 30 నిమిషాలు మసాజ్ చేస్తాయి…పాములతో మసాజ్ వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ మసాజ్ వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. .మన మనసు ఆహ్లాదంగా ఉంటుంది, దీని వల్ల శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల వారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అయితే కొందరు మాత్రమే ఇవి చేయించుకుంటారు.. ఇది చాలా ఖరీదు కూడా 100 ఈజిప్టియన్ పౌండ్స్ రూ.466 వసూలు చేస్తున్నారు.