నిర్మల్ లో భారీ సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీ : రేవంత్ రెడ్డిని నిర్మల్ మర్చిపోదు

Massive bicycle rally in Nirmal to protest rise in petrol, diesel, gas cylinder and daily necessities prices

0
110

పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలిండర్, నిత్యవసర ధరల పెరుగుదలకు నిరసనగా నిర్మల్ లో భారీ సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు 20 వేలకు పైగా కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య ప్రజలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్రంలో రేవంత్ రెడ్డిగారు పీసీసీ ప్రెసిడెంట్ కావాలని కార్యకర్తలు కోరుకున్న మాట వాస్తవం. రేవంత్ వస్తే కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం వస్తుందని, పార్టీ అధికారంలోకొస్తుందని ఆశించారు. అందరూ ఆశించినట్టుగానే రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఎన్నడూ లేనట్టుగా ఏఐసీసీ విస్త్రుత అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతనే రేవంత్ ని పీసీసీ చీఫ్ గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

ఈ నెల 7న వారి ప్రమాణ స్వీకారానికి మహోత్సవాన్ని ఎవరూ ఆర్గనైజ్ చేయకుండానే… స్వచ్ఛందంగా వేలాదిగా, లక్షలాదిగా కార్యకర్తలు తరలివచ్చి ఆశీర్వదించారు. ఆ కార్యక్రమం చూసిన తర్వాత ఎన్నడూ ఫామ్ హౌజ్ దాటి బయటకు రాని ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ దాటి బయటకొచ్చి ప్రజల మధ్య తిరుగుతున్నారంటే ఎంతలా భయపడ్డారో అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి పేరు ప్రకటించగానే 57 ఏళ్లకే పెన్షన్లు గుర్తొచ్చాయి, కొత్త రేషన్ కార్డు గుర్తొచ్చింది. ఇప్పటి నుంచి ఆయనకు అన్నీ గుర్తొస్తయ్. ఓట్లు డబ్బాలో పడంగనే అన్నీ మర్చిపోతడాయన. ఇది ఆయనకు సీఎంకు బాగా అలవాటైపోయింది.

ఈ రాష్ట్రానికి యువరక్తం కావాలి. కాంగ్రెస్ పార్టీ ఓ యువనాయకుడి చేతులో పగ్గాలు పెట్టింది. కానీ పార్టీని అధికారంలోకి తీస్కొచ్చే బాధ్యత తీస్కోవాలి. స్వతంత్రం వచ్చాక కాంగ్రెస్ అధికారంలో చాలా ఏళ్ల పాటు ఉంది. పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసింది.

ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకునేలా కాంగ్రెస్ చేసింది. అలాంటి దేశాన్ని రెండే రెండుసార్లు అధికారమిస్తే అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ రాష్ట్రం పూర్తిగా దివాళా తీసింది. దాదాపు మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పుల పాలైంది. ఇంతా చేసి యువకులు ఉద్యోగాలిచ్చిందా, ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా, ఏ ఒక్కరికైనా ఉపాధినచ్చిందా అంటే అదీ లేదు. కేవలం తన స్వార్థం కోసం కమీషన్ల కోసం మిషన్ భగీరథలు, మిషన్ కాకతీయులు, కాళేశ్వరాలను కట్టుకున్నాడు తప్ప పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడలే. ప్రజలు ఎదురుచూస్తన్నరు. కాంగ్రెస్ మళ్లీ ఎప్పుడు అధికారంలోకొస్తుందని.

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ గా ప్రకటించగానే అటు బీజేపీ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. అంటే రెండు పార్టీలకు కాంగ్రెస్ అంటే ఎంత భయం పుట్టిందో అర్థం చేసుకోవచ్చు. రేపు అధికారంలోకొచ్చాక ప్రజలందరి సంక్షేమం కోసం పాటుపడతాం. మాకోసం మీరు లాఠీ దెబ్బలు తిన్నరు, జైళ్లకు వెళ్లారు, కార్యకర్తల కష్టాన్ని వ్రుథాగా పోనివ్వం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారుల సంగతి అధికారంలోకొచ్చాక చూస్తాం. మీ అందరికీ న్యాయం చేస్తాం, కాపాడుకుంటాం. రేవంత్ పీసీసీ చీఫ్ గా మొదటి కార్యక్రమాన్ని నిర్మల్ కిచ్చారు. రేవంత్ రెడ్డిని నిర్మల్ మర్చిపోదు. వారికి అండగా ఉంటాం. అని అన్నారు మహేశ్వర్ రెడ్డి.