టిఆర్ఎస్ కు ఝలక్..కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

0
55

తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు గులాబీ నేతలు హస్తం గూటికి చేరారు. దీనితో గులాబీ బాస్ గుండెల్లో గుబులు పుడుతుంది.

ఇక తాజాగా పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి కాంగ్రెస్ లోకి చేరగా ఆమె నేతృత్వంలో వందమంది అధికార పార్టీ నాయకులు హస్తం గూటికి చేర్చారు. వీరికి పీసీసీ చీఫ్ రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో.. ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, బంజారాహిల్స్‌, సోమాజిగూడ, వెంకటేశ్వర డివిజన్ల నుంచి డివిజన్‌ కమిటీలు, బస్తీ కమిటీలకు చెందిన వారున్నట్లు తెలిపారు.