తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ..హైదరాబాద్ సీపీ ఎవరంటే?

Massive transfer of IPS in Telangana..Who is the CP of Hyderabad

0
87

తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ పోస్టింగ్‌ ఇచ్చింది. మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు జరిగిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఈ స్థాయిలో చేపట్టలేదు.  హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ ఏసీబీ డీజీగా బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు మరికొందరు కీలక అధికారులను కూడా బదిలీ చేసింది సర్కార్.

హైదరాబాద్‌ నేర విభాగంలో పని చేసిన షికా గోయల్‌ను ఏసీబీ డైరెక్టర్‌గా నియమించారు. నల్గొండ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రంగనాథ్‌ను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా బదిలీ అయ్యారు.

అ.ని.శా. డీజీగా అంజనీకుమార్‌

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సి.వి. ఆనంద్‌

అ.ని.శా. డైరెక్టర్‌గా షికా గోయల్‌

హైదరాబాద్‌ సంయుక్త సీపీగా ఎ.ఆర్‌. శ్రీనివాస్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా ఎ.వి. రంగనాథ్‌

నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరి

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా ఎన్‌. శ్వేత

హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీగా జోయల్‌ డేవిస్‌

హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా కార్తికేయ

మెదక్‌ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని

సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీగా కమలేశ్వర్‌

సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా అవినాష్​ మహంతి

హైదరాబాద్‌ ఉత్తర మండల డీసీపీగా చందనా దీప్తి

హైదరాబాద్‌ డీసీపీగా గజరావు భూపాల్‌

హైదరాబాద్‌ ఎస్‌బీ జాయింట్‌ కమిషనర్‌గా పి.విశ్వప్రసాద్‌

మహబూబూబాద్ ఎస్పీగా శరత్‌ చంద్ర పవార్‌

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి

వికారాబాద్‌ ఎస్పీగా కోటిరెడ్డి

నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కె.ఆర్‌.నాగరాజు

ఆదిలాబాద్‌ ఎస్పీగా డి.ఉదయ్‌కుమార్‌ రెడ్డి

ఆసిఫాబాద్‌ ఎస్పీగా కె.సురేశ్‌కుమార్‌

నిర్మల్‌ ఎస్పీగా సి.హెచ్‌.ప్రవీణ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా కె.మనోహర్‌

మాదాపూర్‌ డీసీపీగా కె.శిల్పవల్లి

బాలానగర్‌ డీసీపీగా సుదీప్‌ గోనె

కామారెడ్డి ఎస్పీగా బి.శ్రీనివాస్‌ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా జె.సురేందర్‌ రెడ్డి

శంషాబాద్‌ డీసీపీగా ఆర్‌.జగదీశ్వర్‌ రెడ్డి

జనగామ డీసీపీగా పి.సీతారామ్‌

నారాయణపేట ఎస్పీగా ఎన్‌.వెంకటేశ్వర్లు