ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు మార్కెట్లో భారీగా పెరగనున్నాయి, దీనికి కారణం
ముడిసరుకుల రేట్లు ఇన్‌పుట్ కాస్ట్స్15 నుంచి 40 శాతం మధ్య పెరిగింది, దీంతో భారీగా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రో ఓవెన్ల వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు పెరుగుతున్నాయి.
అయితే దాదాపు ఇప్పుడు ఉన్న ధరలకు కొత్తగా 20 శాతం ధరలు పెరుగుతున్నాయి.రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్ ఈ వస్తువులు ధరలు పెరుగుతున్నాయి, అందుకే ఈ ముడి సరుకు పెరగడంతో కంపెనీలు కూడా ఈ కొత్త ఖర్చుతో ధరలు పెంచాల్సిన పరిస్దితి వచ్చింది.
వీటి ధరలు గత ఐదు నెలల్లోనే 40-45 శాతం మేర పెరిగింది, ఇక ఫ్రిజ్ లో వాడే ఫోమ్ ఎండ్ మీ కెమికల్స్ ధరలు 150 శాతం పెరిగాయి ఇక రవాణా కూడా గత ఏడాది కంటే ఇప్పుడు 400 శాతం పెరిగింది.. సో ఇవన్నీ కూడా ధరలు పెరగడానికి కరణం అంటున్నారు…ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ స్క్రీన్ల దిగుమతులు కూడా ఇలాగే ఉన్నాయి. ఇక టీవీల ధరలు 5 శాతం పెరుగుతున్నాయి. ఏసీలు 10 శాతం ధర పెరుగుతాయి, ఫ్రిజ్ లు 12 శాతం పెరుగుతాయి టీవీలు కొన్ని 12 శాతం పెరుగుతాయి.