మంత్రులకి కేసీఆర్ సీరియస్ వార్నింగ్ కోపం ఎందుకొచ్చిందంటే

మంత్రులకి కేసీఆర్ సీరియస్ వార్నింగ్ కోపం ఎందుకొచ్చిందంటే

0
87

మున్సిపోల్ కు తెలంగాణ సిద్దం అవుతోంది, 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలను మనమే గెలుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమాగా చెప్పారు, రెండు సార్లు ప్రజలు కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.. ఇప్పుడు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా గెలుపు దిశగా వెళ్లాలి అని చూస్తోంది కారు పార్టీ.

ఈరోజు జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇదే సమయంలో మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఓడినా మంత్రి పదవులు పోతాయని హెచ్చరించారు. దీంతో మంత్రులకి గట్టి వార్నింగ్ ఇచ్చారు అని తెలుస్తోంది, ఇటీవల ఎన్నికల సమయంలో కూడా కొందరు నాయకులు పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లే కొన్ని సీట్లు టీఆర్ ఎస్ కోల్పోయింది అని భావించారు.

అందుకే ముందుగానే మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి అని చెప్పారు.
టీఆర్ఎస్ కు బీజేపీ పోటీ అనే అపోహలు వద్దని కేసీఆర్ అన్నారు. మనకు ఎవరితోనూ పోటీ లేదని చెప్పారు. నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ తో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని సూచించారు.కచ్చితంగా ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ మంత్రులు ప్రచారం చేయాలి, పాత వారిని కలుపుకుపోవాలి అని నేతలకు తెలిపారు ఆయన.