మే 17 తర్వాత ఈ స‌ర్వీసుల పై క్లారిటీ వ‌స్తుంద‌ట‌?

మే 17 తర్వాత ఈ స‌ర్వీసుల పై క్లారిటీ వ‌స్తుంద‌ట‌?

0
94

దేశంలో 40 రోజులుగా ప్ర‌జారవాణా న‌డ‌వ‌డం లేదు, ముఖ్యంగా దేశంలో పెద్ద ఎత్తున ల‌క్ష‌లాది బ‌స్సులు, రైల్లు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి, తాజాగా దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ…దేశవ్యాప్తంగా త్వరలోనే రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవే సంకేతాలు ఇచ్చారు.

కొన్ని నియంత్రణలతో ఈ రవాణాకు అనుమతించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో చాలా మంది ఆశ‌లు పెట్టుకుంటున్నారు, కేంద్రం మే 17 వ‌ర‌కూ లాక్ డౌన్ విధించింది, దీని త‌ర్వాత ప్ర‌జార‌వాణా ప్రారంభం అవుతుందా అని చూస్తున్నారు.

భారత బస్, కార్‌ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో మాట్లాడారు కేంద్రమంత్రి… నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా రవాణా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారని తెలుస్తోంది, ముందు బ‌స్సులు కార్ల‌కు అనుమ‌తులు వ‌స్తాయి అని తెలుస్తోంది. చేతులు శుభ్రం చేసుకోవ‌డం, మాస్క్ ధ‌రించ‌డం కూడా త‌ప్ప‌నిస‌రిగా చేయాలి అని చూస్తున్నారు. క‌చ్చితంగా భౌతిక దూరం పాటించాలి అనే రూల్ తీసుకువ‌స్తున్నారు ఈ ప్ర‌యాణాల స‌మ‌యంలో.