దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 31 వరకూ పొడిగించింది కేంద్రం… ఇప్పుడు నాల్గోవదశ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.. నేటి అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ నాల్గొవ దశ అమలు కానుంది, అందులో భాగంగా నేడు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం
ఇక హట్ స్పాట్స్ రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయి. మే 31 వరకూ సినిమాహాల్స్ విద్యాసంస్ధలు బంద్, మత ప్రార్ధనలు సమావేశాలు మే 31 వరకూ నో పర్మిషన్, ప్రజారవాణాలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఆయా రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో నడుపుకోవచ్చు, దేశంలో మే 31 వరకూ విమానాలు తిరగవు, ఇక మెట్రో రైల్ సర్వీసులు కూడా మే 31 వరకూ బంద్.
రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకూ కర్ప్యూ వాతావరణం ఉంటుంది, హట్ స్పాట్స్ కంటైన్మెంట్లు రెడ్ జోన్లో ఇప్పుడు ఉన్న లాక్ డౌన్ పూర్తిగా అమలు చేయాలి, ఇక షాపింగ్ మాల్స్ , జిమ్ లు స్విమ్మింగ్ పూల్స్ కూడా మే 31 వరకూ మూసివేసి ఉంటాయి.