మన దేశంలో చాలా మందికి జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి, అందులోనే నగదు సేవ్ చేసుకుంటున్నారు, అయితే ఈ ఖాతాదారులు అందరూ ఓ విషయాన్ని తెలుసుకోవాలి..జన్ ధన్ అకౌంట్ ఉన్న వారు వారి బ్యాంక్ ఖాతాను కచ్చితంగా ఆధార్ నెంబర్తో లింక్ చేసుకోవాలి. ఇప్పటికే దీనిపై అనేక సార్లు అధికారులు చెప్పారు, అయితే ఇలా చేసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఖాతాదారులకి వస్తాయి.
జన్ ధన్ అకౌంట్ ఉన్న వారికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఒకటి కేంద్రం కల్పిస్తోంది, ఇక ఈ ఖాతాపై సుమారు 2 లక్షల ప్రమాద భీమా వస్తుంది, అయితే కచ్చితంగా ఈ బ్యాంకు ఖాతాకి ఆదార్ లింక్ చేయాలి.. లేకపోతే ఈ ప్రయోజనం మీకు రాదు.
అలాగే జన్ ధన్ ఖాతా కలిగిన వారిలో కొందరికి రూ.30 వేల లైఫ్ కవరేజ్ కూడా వర్తిస్తోంది.
ఇక ఇది కూడా రావాలి అంటే మీరు అకౌంట్ కి కచ్చితంగా ఆధార్ లింక్ చేసుకోవాలి లేకపోతే ఈ ప్రయోజనం కూడా రాదు..
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి యూఐడీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి 567676 నెంబర్కు ఎంఎంఎస్ పంపితే అకౌంట్ను ఆధార్ నెంబర్తో లింక్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ మీరు మీ బ్యాంకు బ్రాంచుకు వెళ్లి మీ ఆధార్ జిరాక్స్ ఇచ్చినా లింక్ చేస్తారు.