మీ ద‌గ్గ‌ర కార్డ్ లేక‌పోయినా డ‌బ్బులు ఎలా డ్రా చేయాలి తెలుసుకోండి.

మీ ద‌గ్గ‌ర కార్డ్ లేక‌పోయినా డ‌బ్బులు ఎలా డ్రా చేయాలి తెలుసుకోండి.

0
108

ఇప్పుడు ఏటీఎంలు వ‌చ్చిన త‌ర్వాత బ్యాంకుల‌కి వెళ్లి న‌గ‌దు తీసుకునేది త‌గ్గిపోయింది.. చాలా వ‌ర‌కూ ఏటీఎంల‌కు వెళ్లి న‌గ‌దు తీసుకుంటున్నారు, అంతా స్మార్ట్ యుగం కాబ‌ట్టి స్మార్ట్ గానే ట్రాన్సేక్ష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఇంకా క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది.
ఇక ఏటీఎంలో ఉచితంగా డబ్బులు డ్రా చేయడంతో పాటు మరిన్ని సేవల్ని ఫ్రీగా పొందొచ్చు. మ‌రి ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం… బ్యాంకుల బ‌ట్టీ 10 వేల నుంచి 20 వేల వ‌ర‌కూ డైలీ డ్రా చేసుకోవ‌చ్చు.

మీరు స్మార్ట్ ఫోనులో బ్యాంక్ కు సంబంధించిన మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మీరు అప్పుడు అందులో లాగిన్ అవ్వాలి మీ డిటెయిల్స్ తో, అక్క‌డ స‌ర్వీసెస్ అనే ఆప్ష‌న్ లోకి వెళ్లాలి, అందులో కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయ‌ల్ ఫ‌ర్ సెల్ప్ అనే ఆప్ష‌న్ మీకు కనిపిస్తుంది దానిని క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీకు ఎంత డబ్బు కావాలి..? 4 డిజిట్ పిన్ నంబర్..? అకౌంట్ నంబర్ ను అడుగుతుంది.సరైన వివరాలు ఎంచుకున్న తర్వాత.. మీరు సబ్మిట్ బటన్ క్లీక్ చేయండి. ఇప్పుడు మీకు సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. ఈ స‌మ‌యంలో మీకు బ్యాంకు నుంచి ఓ యూనిక్ కోడ్ ఎస్ ఎం ఎస్ వ‌స్తుంది, అప్పుడు మీరు సేమ్ అదే బ్యాంకు ఏటీఎంకు వెళ్లాలి.

ఏటీఎం మెషీన్ లో రిజిస్టర్డ్స్ మొబైల్ నంబర్, యూనిక్ కోడ్, ఏదైనా ఇతర టెంపరరీ కోడ్ వచ్చినట్టైతే దాన్ని ఎంటర్ చేయాలి. దీంతో పాటు యాప్ లో ఎంటర్ చేసిన విత్ డ్రాయల్ అమౌంట్ ను కరెక్ట్ గా ఎంటర్ చేయాలి మీకు న‌గ‌దు వ‌స్తుంది. ఇది ఒక కోడ్ తో ఒక‌సారి మాత్ర‌మే విత్ డ్రా చేయాలి. రెండోసారి చేయ‌డానికి కుద‌ర‌దు.