మిడతల దాడికి దేశంలో రైతులు మరో కీలక నిర్ణయం

మిడతల దాడికి దేశంలో రైతులు మరో కీలక నిర్ణయం

0
92

మన దేశంలో మిడతలు అతి దారుణంగా దాడి చేస్తున్నాయి పంటలపై, ముఖ్యంగా మన దేశంలో రాజస్తాన్,గుజరాత్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్రల్లో వీటివల్ల తీవ్ర పంటనష్టం వాటిల్లుతోంది, రైతులు ఇప్పటికే పురుగుల మందు ఘాటైనవి కూడా పిచికారి చేస్తున్నారు, అయినా ఇవి దాడి చేస్తున్నాయి.

పాకిస్తాన్ నుంచి భారత్కు వలసొచ్చిన ఈ మిడతల దండు పొడవు సుమారు 2కి.మీ నుంచి 3కి.మీ పొడవు ఉంది. రైతులు పంటను కాపాడుకోవడానికి అనేక చర్యలకు దిగుతున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు రాత్రిపూట చేస్తున్నారు, డీజే సౌండ్లు, డప్పులు కొట్టిస్తున్నారు, కంచాలు గరిటెలతో చప్పుడు చేస్తున్నారు.

ఇంకొన్నిచోట్ల మంటలు పెట్టడం,పొలాల్లో ట్రాక్టర్లు తిప్పుతూ మిడతలను బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాని ఇవి అన్నీంటికి సిద్దం అయ్యాయి ఎక్కడా ఆగడం లేదు.. దాడి చేస్తూనే ఉన్నాయి, పంటలు కొన్ని లక్షల హెక్టార్లలో నాశనం అయ్యాయి. స్థానిక అధికారులు భారీగా క్రిమిసంహారక మందులు చల్లి వాటిని తరిమే ప్రయత్నం చేస్తున్నారు.