కరోనా సమయంలో రోడ్లపైకి ఎవరూ రావద్దు అని పోలీసులు చెబుతూనే ఉన్నారు.. అసలు రోడ్లపై తిరగవద్దు అని వైరస్ వ్యాప్తి ఉంటుంది అని చెప్పినా చాలా మంది అవసరం లేని పనులకి కూడా దూరం వెళుతున్నారు, ఈ సమయంలో ఇటీవల మీడియా వాహనాలు మీడియా ఉద్యోగులకి కాస్త వెసులుబాటు కల్పించారు.
కేంద్రం నేరుగా ఆదేశాలు ఇచ్చింది ..వారు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వారిని ఆపవద్దు అని.. అయితే తాజాగా ఓ వ్యక్తి తాను మీడియాలో పని చేస్తున్నా అని ఫేక్ ఐడీ కార్డ్ క్రియేట్ చేసుకున్నాడు, ఎక్కడ ఆపినా అది చూపించి తప్పించుకుంటున్నాడు.
అయితే ఓ ఎస్పీ అధికారి రాత్రి చెక్ చేస్తున్న సమయంలో అతని ఐడీ కార్డ్ చూపించాడు.. ఎస్పీకి అనుమానం వచ్చింది ..మీ హైయ్యర్ అధికారి నెంబర్ చెప్పు ఇప్పుడు డ్యూటీ నుంచి వస్తున్నావు కదా అడుగుతా అన్నాడు… దీంతో నీళ్లు నమిలాడు ..అది ఫేక్ అని చెప్పాడు, వెంటనే అతన్నీ జైల్లో వేశారు, ఇలాంటి పనులు చేస్తే తాటతీస్తాం అంటున్నారు పోలీసులు.