మీసేవ రద్దు ఆలోచనలో ప్రభుత్వం…?

మీసేవ రద్దు ఆలోచనలో ప్రభుత్వం...?

0
82

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలు ఎక్కువగా ఫ్రాంఛైజీల ద్వారా నడుస్తున్నాయి. మీ సేవ ద్వారా ప్రజలకు వివిధ రకాల పౌర సేవలు అందుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాల భర్తీ చేస్తూ ఉండటంతో మీ సేవ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రజలకు గ్రామ సచివాలయాల ద్వారా మీ సేవ అందించే సేవలన్నీ ప్రభుత్వమే అందించబోతుంది.

అందువలన మీ సేవ కేంద్రాలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇంతకాలం మీ సేవ ద్వారా ఉపాధి పొందినవారు మీసేవ రద్దు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు 367 రకాల ప్రభుత్వ, 30 రకాల ప్రైవేట్ సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 11,000కు పైగా మీ సేవ కేంద్రాలు ప్రారంభం కాగా దాదాపు రెండు వేల కేంద్రాలు వివిధ కారణాల వలన మూసివేయటం జరిగింది.

పౌరులకు ప్రభుత్వం అందించే సేవలు, పథకాల లభ్ది కోసం ప్రజలు మీ సేవ కేంద్రాలలో ధరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికేటన్లు జత చేసి నిర్ణీత రుసుము చెల్లించి మీసేవ కేంద్రంలోని నిర్వాహకులకు అందించేవారు. మీ సేవ నిర్వాహకులు ఆ ధరఖాస్తులను కంప్యూటర్లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపేవారు. ఆ ధరఖాస్తులు ఆమోదించబడిన తరువాత మీ సేవ నిర్వాహకులు ఆమోదించబడిన సర్టిఫికెట్లను ప్రజలకు అందించేవారు.

కానీ రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్ళకు ఒకరు చొప్పున గ్రామ వాలంటీర్లను ఇప్పటికే నియమించారు. ఆగష్ట్ 15వ తేదీ నుండి గ్రామ వాలంటీర్లు విధులు నిర్వర్తించబోతున్నారు. అక్టోబర్ 2 వ తేదీన గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలన మొదలు కాబోతుంది. అందువలన మీ సేవలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.