Flash- ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ కీలక భేటీ..ఆ వివాదం సద్దుమణిగేనా!

0
103

ఏపీలో సినిమా టికెట్ల దుమారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. టికెట్ల రేటు పెంచేదే లేదని సర్కార్ స్పష్టం చేయగా..రేట్లు పెంచకుంటే జరిగే నష్టాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే మంత్రి పేర్ని నానితో అర్జీవి భేటీ కాగా ఇవాళ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. టికెట్ల రేట్లు పెంచుకుంటే జరిగే నష్టాన్ని సీఎం కు వివరించనున్నట్టు తెలుస్తోంది.