మెట్రో ప్ర‌యాణాల‌కు కొత్త కండిష‌న్లు కేంద్రం – స్టేట్స్ రెడీ

మెట్రో ప్ర‌యాణాల‌కు కొత్త కండిష‌న్లు కేంద్రం - స్టేట్స్ రెడీ

0
81

మ‌న దేశంలో మెట్రోలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, వేగంగా మ‌నం చేరాలి అనుకునే ప్రాంతానికి మెట్రో ద్వారా చేరుకోవ‌చ్చు, బై రోడ్ కంటే మెట్రో జ‌ర్నీ వేగంగా జ‌రుగుతోంది, హైద‌రాబాద్ డిల్లీ బెంగ‌ళూరు చెన్నై ఇలా ప్ర‌ముఖ న‌గ‌రాల్లో మెట్రో సేవ‌లు ఉన్నాయి, అయితే లాక్ డౌన్ తో ప్ర‌జార‌వాణా పూర్తిగా ఆగిపోయింది.

దాదాపు 45 రోజులుగా ప్ర‌జార‌వాణా ఆపేశారు, ఇక త్వ‌ర‌లో అంటే మే 17 త‌ర్వాత ప్ర‌జార‌వాణా పై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది,ఇప్ప‌టికే ప‌లు స‌డ‌లింపులు ఇచ్చిన కేంద్రం ర‌వాణా విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌ల‌తో గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారు అని అంటున్నారు.

వచ్చే వారంలోపు దాదాపు అన్ని గ్రీన్ జోన్లలో ప్రజారవాణా మొదలు కానుంది. అంతేకాదు వీటికోసం అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క‌చ్చితంగా మెట్రో సర్వీసులలో భౌతిక దూరం పాటించాలి, ఎంట‌ర్ అయిన స‌మ‌యంలో స్టేష‌న్ లో ధ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ ఉంటుంది, హ్యాండ్ వాష్ శానిటైజ‌ర్లు రాసుకోవాలి, మెట్రో రైళ్లలో ప్రయాణీకులు నిలుచునేందుకు వైట్ మార్కింగ్ సర్కిల్స్ ఏర్పాటు చేస్తున్నారు, గుంపులుగా ఎక్క‌డానికి వీలు ఉండ‌దు,

ఒక్కో రైలులో 1000 మంది వరకు ప్రయాణించేవారు. అయితే ఇప్పుడు అలా కాకుండా కేవలం 50 శాతం మంది మాత్రమే జర్నీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు, ఎస్క‌లేట‌ర్లు స్టేష‌న్లు ప్ర‌తీ గంట‌కు శానిటైజ్ చేస్తూ ఉంటారు, మాస్క్ క‌చ్చితంగా వాడాల్సిందే.