మెట్రో ప్రయాణికులు ఇవి పాటించాలి కేంద్రం రూల్స్ విడుదల

మెట్రో ప్రయాణికులు ఇవి పాటించాలి కేంద్రం రూల్స్ విడుదల

0
99

కేంద్రం మెట్రో రైలు సేవలు ఈ నెల 7వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పునఃప్రారంభం చేసుకోవచ్చు అని తెలిపింది, దీంతో ఈ నెల 12 నుంచి అన్ని కారిడార్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తాజాగా మెట్రో సేవలకు మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.

ఇక మెట్రో సర్వీసులు ఉన్న చోట కంటైన్ మెంట్ జోన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసే ఉంచుతారు.
ప్రతీ ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు
లక్షణాలు ఉంటే అనుమతి ఉండదు
కచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ ప్రయాణికులు ఉండాలి
కొన్ని స్టేషన్లలో మాత్రమే ట్రైన్లు ఆగుతాయి, దీని వల్ల క్రౌడ్ తగ్గుతుంది
తక్కువ లగేజీని మాత్రమే అనుమతిస్తారు.
ఐరెన్ మెటల్ వస్తువులు ప్రయాణికులు తీసుకురావద్దు అనుమతించరు
రైలు బోగీల్లో కూడా మార్కింగ్ వేస్తారు. కచ్చితంగా బోగీల్లో పాటించాలి
ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా మాస్కులు కచ్చితంగా ధరించాలి.
స్టేషన్లో మాస్కులు అమ్మేలా చూడాలి
శానిటైజర్లు అందుబాటులో స్టేషన్లో ఉండాలి
శానిటైజేషన్ ప్రక్రియ స్టేషన్లో జరగాలి
స్మార్ట్ కార్డ్, ఆన్ లైన్ చెల్లింపులకు ఎక్కువ అవకాశం