అన్ లాక్ 4 మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది, దీంతో ఇక రవాణా విషయంలో చాలా మంది మెట్రో ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని ఎదురుచూశారు, అయితే కేంద్రం సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభించుకోవచ్చు అని తెలిపింది దీంతో అన్నీ స్టేట్స్ లో ఉన్న మెట్రో అధికారులు సిద్దం అవుతున్నారు.
ఢిల్లీలో మెట్రో సర్వీసులను పునరుద్ధరించేందుకు ఢిల్లీ సర్కారు ఏర్పాట్లు చేస్తుంది. కేవలం స్మార్ట్ కార్డులనే అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఇక స్టేషన్లలో ఎవరికి టోకెన్లు ఇవ్వరు,
అలాగే ప్రయాణికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇక అక్కడ అధికారులు ప్రతీ రెండు మూడు గంటలకు శానిటైజేషన్ ప్రక్రియ చేస్తారు కేవలం స్మార్ట్కార్డ్, ఇతర డిజిటల్ పేమెంట్ మాత్రమే చెయ్యాలి.థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు ఢిల్లీ అధికారులు, అయితే ఇలాంటి ప్రాసెస్ అన్నీ చోట్లా అమలు అవుతుంది అంటున్నారు కొందరు, ఇక హైదరాబాద్ లో కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు, టోకెన్లు లేకుండా ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్ స్మార్ట్ డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మెట్రోస్టేషన్లలో ఉమ్మితే రూ.200 వరకు జరిమానా విధించనున్నారు ఢిల్లీ మెట్రో అధికారులు .