మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా

0
160

మైక్రోసాఫ్ట్ ఈ పేరు తెలియని వారు ఉండరు… అంతేకాదు బిల్ గేట్స్ పేరు కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు, అందరికి ఆయన సుపరిచితులే, బిల్ గేట్స్ అక్టోబర్ 28 – 1955 న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్లో ఒక ధనవంతులు కుటుంబంలో జన్మించాడు. ఎలెమెంటరీ స్కూల్లో ఉన్నపుడు గణితం,
సైన్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం ఉండేది.

ముందు నుంచి లెక్కలపై ఫోకస్ చేసేవారు, తర్వాత తన మిత్రుడు పాల్ అల్లెన్తో కలసి కంప్యూటర్ లాంగ్యేజి అయిన బేసిక్ (BASIC) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో పాల్ అల్లెన్తో కలసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి అమ్మడం మొదలు పెట్టాడు.

ఇదే బిల్ గేట్స్ కు తొలివ్యాపారం, ఇలా 14 ఏళ్లకే ఆయన వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చేశారు
…మొదటి ఏడాది 20,000 డాలర్లు సంపాదించారు. 1975లో MITS అనే మైక్రో కంప్యూటర్ సంస్థకి అవసరమయిన సాఫ్ట్వేర్ తాము అందించగలమని బిల్ గేట్స్ ఒప్పందం చేసుకున్నాడు.
ఏడాది తర్వాత మైక్రోసాఫ్ట్ అన్న పేరు రిజిస్టర్ చేయించుకుని బిజినెస్ ప్రారంభించాడు.

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ను ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థగా చేశాడు. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని బిల్గేట్స్ తన హస్తగతం చేసుకున్నారనే చెప్పాలి.. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్ని ఆవిష్కరణలకూ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా తనకు పోటీ లేకుండా ఈ రంగంలో ఎదిగాడు బిల్ గేట్స్.

బిల్ గేట్స్ భార్య పేరు మెలిండా. వారికి ముగ్గురు పిల్లలు. వాషింగ్టన్ లో 5.15 ఎకరాల విశాలమయిన ఎస్టేట్లో దాదాపు 50,000 చదరపు అడుగులు విస్తీర్ణంగల ఇంటిలో వీరి నివాసం ఉంటున్నారు.
ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు ఏడేళ్ళు పట్టింది.1995 నుండి 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు.

2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య ఇలా సేవలకు ధన సహాయం చేస్తున్నాడు. ఇప్పటికీ తన ఆదాయంతో ఇలా దాన ధర్మాలు చేస్తున్నారు ఆయన.