మైక్రో సాఫ్ట సీఈవో సత్యనాదెళ్ళకు పితృవియోగం

మైక్రో సాఫ్ట సీఈవో సత్యనాదెళ్ళకు పితృవియోగం

0
82

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. యుగంధర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నిబద్ధత ఉన్న అధికారిగా పేరొందిన ఆయన యూపీఏ పాలనలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా వ్యవహరించారు. అంతకుముందు పీవీ నరసింహారావు హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖలో తనదైన ముద్ర వేశారు. కీలక సంస్కరణలతో ఆ శాఖను పరిపుష్టం చేశారు.