రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జూలై 1 నుండి 10 వతేది వరకు నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల అమలు పై సోమవారం కరీంనగర్ వి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సన్నాహక సమావేశమునకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెలు పట్టణాలు గా మారాలని పట్టణాలు ఆధునీకరణ చెంది బంగారు తెలంగాణ నిర్మాణం కావాలని పల్లె, పట్టణ ప్రజలు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్య మంత్రి పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలను ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు . పల్లె, పట్టణ ప్రగతి లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నేరుగా స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు గతములో ఎన్నోమార్లు హరితహారం లో మొక్కలు నాటామని అవి రక్షించబడ లేదని, అందుకు కారణం నీరు లేదని అన్నారు . అందుకే రాష్ట్ర ముఖ్య మంత్రి నీటి కొరత లేకుండా ప్రాజెక్టుల ద్వారా నీరు, నిధుల కొరత లేకుండా నెలనెలా నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. తద్వారా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని , పట్టణాలు అందమైన సుందర నగరాలుగా ఆధునీకరించ బడుతున్నాయని తెలిపారు. గతంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, కలరా, డయేరియా ,వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చి జనం చనిపోయేవారు అని తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గ్రామాలలో పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు ముమ్మరంగా నిర్వహించేలా చేపట్టిన చర్యలవల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యవంతమైన గ్రామాలుగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు.
పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి ,హరితహారం కార్యక్రమాల అమలుపై మంగళవారం మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వము నీళ్లు,నిధులు ఇస్తుందని హరిత హారంలో నాటిన మొక్కలను రక్షించబడడం తో పాటు లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. పల్లె ,ప్రగతి పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలలో నిర్లక్ష్యం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్య మంత్రి జూలై 10 వరకు జిల్లాలలో ఆకస్మిక పర్యటన నిర్వహిస్తారని తెలిపారు .పల్లె ప్రగతి లో భాగంగా గ్రామాలకు మంజూరు చేసిన వైకుంఠ దామల నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతి లో గ్రామాలలో ప్రమాదకరమైన పాత బావులను గుర్తించి పూడ్చి వేయాలని, రోడ్లపై నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు .ప్రతి ఒక్కరూ పల్లెల్లో ప్రగతి కోసం పని చేయాలని, పల్లె ,పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు జిల్లా మంత్రులకు , జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రత్యేక నిధులను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు నిర్వహించాలని, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి సూచించారు . పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను యజ్ఞంలా భావించి ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం హరితహారం పై ముద్రించిన పోస్టర్ లను మంత్రి ఆవిష్కరించారు.
జిల్లా చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని తెలిపారు భావితరాల బంగారు భవిష్యత్తుకు హరితహారం లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి అని కోరారు.పల్లె ప్రగతి లో మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని కోరారు
శాసనమండలి సభ్యులు భాను ప్రసాదరావు మాట్లాడుతూ పల్లెలు, పట్టణాల అభివృద్ధి తోనే బంగారు తెలంగాణ సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. హరిత హారంలో మొక్కలు విరివిగా నాటి ఆకుపచ్చ తెలంగాణకు పునాదులు వేయాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కె .శశాంక మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పనులలో పోటీ పడాలని అన్నారు. పల్లె ప్రగతి లో భాగంగా జిల్లాలో 314 వైకుంఠధామం నిర్మాణ పనులు మంజూరు కాగా, ఇంతవరకు 307 వైకుంఠ దామల నిర్మాణాలు పూర్తి అయినవని తెలిపారు. జిల్లాలో గ్రామానికి ఒక సేగ్రీ గేషన్ షెడ్ ను మంజూరు చేయగా అన్ని నిర్మాణ పనులు పూర్తయ్యాయని , రెండు గ్రామాలలో పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. పల్లె ప్రకృతి వనం లో భాగంగా జిల్లాలో రెండు వందల ఇరవై ఎకరాల్లో 402 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనం పది ఎకరాల లో ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు .గ్రామాలలో పారిశుద్ధ్య పనుల కార్య చరణ ప్రణాళికలు రూపొందించుకొని ప్రతిరోజు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించాలని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారం లో ప్రధాన రోడ్లకు ఇరువైపులా రెండు మూడు వరుసలలో మొక్కలు నాటాలని తెలిపారు.
ఈ సమావేశంలో మానకొండూరు, చొప్పదండి శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ ,నగర మేయర్ వై .సునీల్ రావు సుడా చైర్మన్ జి.వి రామకృష్ణ, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, డి ఆర్ డి ఓ శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జడ్పీ సీఈఓ రమేష్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీవోలు ఎంపీవోలు, తదితరులు పాల్గొన్నారు .