కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని మంత్రి తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.