Flash: మంత్రి రోజా సెల్ ఫోన్ చోరీ.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు

0
77

ఆంధ్రప్రదేశ్ నూతన క్యాబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా రోజాకు ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలు అప్పగించిన  విషయం తెలిసిందే. తాజాగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో క్రీడలపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు రోజా దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్లడంతో అక్కడ రోజా సెల్ ఫోన్ గుర్తు తెలియని వ్యక్తి  దొంగతనం చేసినట్టు గుర్తించారు. దాంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి..చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.