సిఎం కేసిఆర్ కు మంత్రి ధన్యవాదాలు

0
86

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మంజూరు చేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శాసన సభ్యుల అభ్యర్థన మేరకు ఆయా కళాశాలలను మంజూరు ఇచ్చారన్నారు. ఆయా ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రుల,ప్రజల కోరిక కూడా నెరవేరుతుందన్నారు.వికారాబాద్,పరిగి మహేశ్వరం,ఉప్పల్ లలో ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు.

ఉమ్మడి జిల్లా ప్రజల తరుపున సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసినందుకు సిఎం చంద్రశేఖర్ రావు కి విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్,పరిగి, మహేశ్వరం, ఉప్పల్ లకు నూతనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసి ఆయా ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు జిల్లా ప్రజల తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్  నూతన విద్యాలయాల ఏర్పాటు చేశారన్నారు.