Breaking: మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం

0
75

తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ప్రస్తుతం సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆమె హుటాహుటిన పెద్దతండాకు బయలుదేరారు. కాగా ఇవాళ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్బంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో ఉండగా మంత్రి ఇంట విషాదం నెలకొనడం సత్యవతి అభిమానులను విషాదంలో ముంచెత్తింది.