Breaking: మరిపెడలో మంత్రి సత్యవతి కాన్వాయ్ కు ప్రమాదం..

0
76

శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం జరిగింది. మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న క్రమంలో మరిపెడ సమీపంలోకి రాగానే కాన్వాయ్ కు పంది అడ్డు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా పంది అడ్డం రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసాడు. ఈ క్రమంలో వెనక వస్తున్న మరో వాహనం మంత్రి కాన్వాయ్ ను ఢీకొనడంతో..గన్ మేన్ ల‌కు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది. కానీ ఈ ప్రమాదంలో మంత్రి సత్యవతి ఎలాంటి హాని కలగలేదని పోలీసులు చెబుతున్నారు.